ప్రతిభ పరీక్షలను విద్యార్థులందరు‌ సద్వినియోగం చేసుకోవాలి: ఎస్ఐ సతీష్ రెడ్డి 

నవతెలంగాణ – హలియా
పదవ తరగతి విద్యార్థుల లో భయాన్ని పోగొట్టడంలో ఈ పరీక్ష ఉపయోగ పడుతుంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా టాలెంట్ టెస్ట్ పరీక్షను హాలియా పట్టణ కేంద్రంలో కొన్ని సెంటర్లలో నిర్వహించడం జరిగింది ఈ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సతీష్ రెడ్డి  హాజరై స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రశ్న పత్రాలు విడుదల జేశారు. అనంతరం అయన  మాట్లాడుతూ విద్యార్థులందరూ భవిష్యత్తులో జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల కంటే ముందు ఇలాంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఎప్పుడు పోరాటాలకే కాకుండా ఇలాంటి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం హర్షించదగ్గ విషయం అన్నారు. విద్యార్థులందరూ ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఇలాంటి ప్రతిభ పరీక్షల్లో ప్రతి ఒక్కరూ మంచి ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో మంచి పాయింట్స్ సాధించాలన్నారు. విద్యార్థులందరూ శ్రమించి చదివితే విజయం అనేది బానిసవుతుందని పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రతిభ పరీక్షల్లో పాల్గొనడం వల్ల ఇప్పటివరకు ఎంత చదివాము ఇంకా ఏవిధంగా చదివితే విద్యార్థులు అనుకున్న గోలు చేరడం కోసం ఉపయోగ పడుతుందో తెలుసుకోని ఆవిధంగా కష్టపడి చదవాలని తెలుస్తుందన్నారు. ఈ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ  శుభాకాంక్షలు తెలియజేశారు . విద్యార్థులు మత్తు పదార్థాలకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని గుట్కా పాను ఇలాంటి చెడు అలవాట్లను దరిచేరనీయకుండా మంచి క్రమశిక్షణ భావంతో మెలగాలని కోరారు. విద్యార్థులు అందరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అని చెప్పారు. మన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ చెప్పినట్టు కలలను కంటూ సహకారం చేసుకునే విధంగా విద్యార్థుల కృషి ఉండాలని అన్నారు. నల్గొండ పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి హాలియా మరియు జిల్లా వ్యాప్తంగా రాసే ఈ పదో తరగతి పరీక్షలలో సుమారు 6000 మంది విద్యార్థులు పాల్గొనడం పదో తరగతి పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను‌ అభినందించి మంచి పారితోషకాలు అందించడం జరుగుతుంది అన్నారు. విద్యార్థులందరూ ఇప్పుడున్న సమయం మొత్తం పరీక్షల సమయం కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా బాగా కష్టపడి చదవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో జరగబోయే పదో తరగతి పరీక్షలు మంచి మార్కులు సాధించి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ మీరు పుట్టిన గ్రామానికి మండలానికి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలనిఅన్నారు. భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాగార్జునసాగర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నల్లబెల్లి జగదీష్, కోరే రమేష్ పెద్దూరు మండల కార్యదర్శి సాయి అనుమల అనుముల మండల అధ్యక్షులు దోసపాటి నబీన్ కడారి నాగరాజు షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు.