గ్రామస్తులందరూ కుటుంబమనే భావన కల్పించింది..

– వీడ్కోలు సమావేశంలో సర్పంచులు తిరుపతి రెడ్డి, తిరుపతి 

నవతెలంగాణ-బెజ్జంకి 
సర్పంచ్ పదవి గ్రామస్తులందరూ ఒకె కుటుంబ సభ్యులేననే భావనను కల్పించిందని లక్ష్మీపూర్, బెజ్జంకి క్రాసింగ్ గ్రామాల సర్పంచులు ముక్కీస తిరుపతి రెడ్డి,టేకు తిరుపతి ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిధిలోని లక్ష్మీపూర్, బెజ్జంకి క్రాసింగ్ గ్రామాల పంచాయతీ కార్యాలయాల వద్ద ఎంపీటీసీ ముక్కీస పద్మ,అయా గ్రామాల మహిళ సంఘాల, యువజన సంఘాల సభ్యులు పంచాయతీ పాలకవర్గం సభ్యులను శాలువాలు కప్పి సన్మానించి జ్ఞాపికలను అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన పెండ్యాల బాపురెడ్డి ఆకాల మరణం తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని సర్పంచ్ ముక్కీస తిరుపతి అవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులకు సహకరించిన ప్రజలకు, అధికారులకు సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు.