‘ఈ పదేళ్లు ప్రతి సినిమా ఒక వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ప్రతి హీరోతో ఒక అద్భుతమైన రిలేషన్. నేను ఏ జోనర్ సినిమా చేసిన ప్రేక్షకులు గొప్పగా సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఈ పొంగల్‌కి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఓ అద్భుతమైన విజయం ఇచ్చారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విక్టరీ నా కెరీర్‌లో ఓ హిస్టరీ’ అని డైరెక్టర్ అనిల్ రావి పూడి అన్నారు. దర్శకుడిగా నేటి (గురువారం)తో పదేళ్ళ జర్నీ కంప్లీట్ అయిన సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
– ‘సంక్రాంతికి వస్తున్నాం’ మామూలు సక్సెస్ కాదు. ఆరు రోజుల్లో వంద కోట్ల షేర్, వన్ వీక్‌లో రూ.200 కోట్లు క్రాస్ చేయడం అంటే ఓ అద్భుతం. ఇది నా కెరీర్‌లో హిస్టరీ. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి ఈ బలం ఉందని ప్రేక్షకులు చాలా స్ట్రాంగ్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారని అనిపిస్తోంది.
– డైరెక్టర్ కావడం నా డ్రీమ్. అది ‘పటాస్’తో తీరిపోయింది. ఇదంతా బోనస్‌గా భావిస్తున్నాను. నాకు లైఫ్ ఇచ్చింది ప్రేక్షకులే. వారికి పైసా వసూల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడమే నా టార్గెట్.
– హీరో కళ్యాణ్ రామ్ లేకపొతే నా కెరీర్ లేదు. ఆయన ‘పటాస్’ని ప్రొడ్యూస్ చేసి, నన్ను డైరెక్టర్‌గా నిలబెట్టారు. నేను సినిమాలు చూస్తూ విజిల్స్ కొట్టిన హీరోలతో కలిసి పనిచేయడం అల్టిమేట్ ఫీలింగ్.
– ఇన్నేళ్ళ కెరీర్‌లో నా సినిమాని చూస్తూ, సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకుల ప్రేమని
పొందగలిగాను. ఈ పదేళ్ళుగా నాకు వచ్చిన ఆస్తి అదే. దీన్ని సినిమా సినిమాకి పెంచు కుంటూ వెళ్తున్నా.
– ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్‌తో అనిల్ మమల్ని నిలబెట్టారని దిల్ రాజు, శిరీష్ చెప్పారు. నిజానికి నిలబెట్టింది నేను కాదు..ప్రేక్షకులు. ఈ సినిమాకి బళ్ళుకట్టుకొని వచ్చి చూశారు. ఈ సినిమా విజయం ఓ వండర్. ఓ కేస్ స్టడీ.
– 100% మీరు ఊహించిన దాని కంటే ఎక్కువగా చిరంజీవితో చేసే సినిమా ఉంటుంది. నాగ్‌తో ‘హలో బ్రదర్’ లాంటి సినిమా చేస్తా. చిరు, వెంకీ, బాలయ్య, నాగ్‌తో సినిమాలు చేసిన రికార్డ్ కూడా నాదే అవుతుంది.