కామన్ సర్వీస్ సెంటర్లలో అన్నిరకాల డిజిటల్ సేవలు

నవతెలంగాణ-పెన్ పహాడ్:
కామన్ సర్వీస్ సెంటర్లలో అన్నిరకాల డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయని సిఎస్సి డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీచరణ్ అన్నారు. మండల పరిధిలోని ధర్మపురం గ్రామంలోని కామన్ సర్వీస్ సెంటర్ ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎస్సిలలో అందుబాటులో ఉన్న సేవలైన పాన్ కార్డ్, ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్, ఈ శ్రమ్, రైల్, బస్సు టికెట్ బుకింగ్, ఆధార్ తో అకౌంట్ నుండి డబ్బు పొందడం, పిఎంజి దిశ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఎస్సీ నిర్వాహకులు తాడూరి లింగయ్య, మధు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.