న్యూఢిల్లీ: భారతీయ దుస్తుల బ్రాండ్ బ్లాక్‌బెర్రీస్ ఆల్-వెదర్ టెక్నాలజీని కలిగి ఉన్న సరికొత్త టెంప్ టెక్ అపెరల్ శ్రేణీని విడుదల చేసినట్లు తెలిపింది. ‘వేర్ యువర్ క్లైమేట్’ పేరుతో వీటిని అందిస్తోన్నట్లు పేర్కొంది. వీటిలో కోకోనా ల్యాబ్స్ ద్వారా పేటెంట్ పొందిన 37.5 టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. ఇది శరీర ఉష్ణోగ్రతను ఆదర్శవంతమైన 37.5 సెల్సియస్‌లో క్రమబద్ధీకరించడానికి మద్దతుని స్తుందని తెలిపింది. ఇది ప్రత్యేకంగా పని కోసం లేదా విశ్రాంతి కోసం ఎల్లప్పుడూ ఆరుబయట తిరిగే పురుషుల కోసం రూపొందించబడిందని పేర్కొంది. ఇవి 350కి పైగా నగరాల్లోని అన్ని ప్రముఖ బ్లాక్‌బెర్రీస్ అవుట్‌లెట్‌లలో లభిస్తాయని వెల్లడించింది.