సింగల్‌ విండో చైర్మన్‌గా అల్లాడి యాదగిరి రావు, వైస్‌ చైర్మన్‌గా ఏలువాక కొంరయ్య

నవతెలంగాణాముత్తారం: ముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగల్‌ విండో చైర్మన్‌గా అల్లాడి యాదగిరి రావు,  వైస్‌ చైర్మన్‌గా ఏలువాక కొంరయ్యలను శనివారం ఎన్నికయినట్లు డిసిఓ శ్రీమాల, సూపరింటెండెంట్‌ సువర్ణ, జూనియర్‌ అసిస్టెంట్‌ రూప ప్రకటించారు. శుక్రవారం సింగల్‌ విండో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లపై అవిశ్వాసం నెగ్గడంతో ఆ స్థానాలు కాలి ఏర్పడ్డాయి. ఈ మేరకు శనివారం ఆ స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. మొత్తం మెజారిటీ 7 మంది డైరెక్టర్లు చైర్మన్‌గా అల్లాడి యాదగిరి రావును, వైస్‌ చైర్మన్‌గా ఏలువాక కొంరయ్యలను ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన సింగల్‌ విండో చైర్మన్‌ అల్లాడి యాదగిరి రావు, వైస్‌ చైర్మన్‌ ఏలుకా కొంరయ్యలు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు, జిల్లా, మండల కాంగ్రెస్‌ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సింగల్‌ విండో బలోపేతానికి తమసాయశక్తుల కృషి చేస్తామని, సింగల్‌ విండో పరిధిలో సమస్యలను సత్వర పరిష్కారానికి మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో అవినీతికి తావులేకుండా పని చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్‌ రావు, మండల మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు వాజిద్‌ పాషా, మండల యూత్‌ అధ్యక్షుడు బియ్యాని శివ కుమార్‌, జిల్లా ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్‌, నాయకులు బలినేని బుచ్చం రావు, తూటి రఫి, కోల విజయ్‌, తాటిపాముల శంకర్‌, గూట్ల రవీందర్‌తదితరులున్నారు.