మంత్రి మెప్పు కోసమే బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు 

– బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు హరీష్..
– మాజీ ఎంపిటిసి రావుల కల్పన మొగిలి
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు మెప్పుకోసమే బిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు అర్ధరహితమైన ఆరోపణలు చేశారని బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు జాగరి హరీష్,తాడిచెర్ల మాజీ ఎంపిటిసి రావుల కల్పన మొగిలి అన్నారు. శనివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తాడిచర్ల-భూపాలపల్లి రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదని విమర్శించారు.మంత్రి మెప్పుకోసమే అర్థం పర్థం లేని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు తాడిచెర్ల-భూపాలపల్లి రోడ్డు నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేదన్నారు.రోడ్డు నిర్మాణం గురించి అడుగుతే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఇలా ఎన్ని రోజులు పబ్బం గడుపుతారో చెప్పాలని ప్రశ్నించారు.కాంగ్రెస్ 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా మండల కార్యాలయాలు తాడిచర్లకు తీసుకురాకపోతే,తమ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచిన నాలుగు సంవత్సరాల కాలంలోనే మంథని నుండి కార్యాలయాలు తాడిచెర్లకు తీసుకొచ్చిన ఘనత  పుట్ట మధుదేన్నారు.తమ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోడ్లు బ్రిడ్జిలు తీసుకువచ్చి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తే, అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక ఏం మాట్లాడుతున్నారో వాళ్లకి అర్థం అవ్వట్లేదని ఆరోపించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ఇచ్చిన 420 హామీలను ఇస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ కాదాన్నారు.