– కౌన్సిలర్ భర్త ఆంజనేయులు తన స్వప్రయోజనాల కోసం బురద జల్లుతున్నారు
నవతెలంగాణ-దుండిగల్
నిరాధార ఆరోపణలు సరికావని,కావాలనే కొందరు వ్యక్తులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మల్లంపేట శ్రీ లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ అధినేత గుర్రం విజయలక్ష్మి అన్నారు. బాచుపల్లి లోని తన ఆఫీస్‌లో విలేకరుల సమావేశం ఆమె మాట్లాడారు. మల్లంపేట్ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరిట నిర్మించిన విల్లాస్ గహాలను మొదట హెచ్ఎండిఏ అనుమతులతో నిర్మించి, ఆ తరువాత అప్పటి గ్రామ పంచాయతీ హయాంలో బిట్స్‌గా కొనుగోలు చేసి అందుకు తగిన స్థానిక ప్రామాణికంగా అధికారులు విధించిన నిబంధనల మేరకే మిగతా విల్లాసులు నిర్మించామన్నారు. కొంతమంది కొనుగోలుదారులు ఇప్పటికీ డబ్బు కట్టని వారు ఉన్నారని, వారికి కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించినట్లయితే అరకోరా పెండింగ్ ఉన్న పనులు సైతం పూర్తవుతాయని డబ్బులు కట్టని వారు ఇంకా ఉన్నారని, వసతులు పూర్తి చేయలేదన్నది వాస్తవం కాదని చెప్పారు. మల్లంపేట జీఎల్సీ విల్లాలలో అసోసియేషన్ పేరుతో కొందరు వ్యక్తులు పట్టాభూమిలో పార్కు ఏర్పాటుచేసి కొనుగులు దారులను అడ్డుకున్నారని, 2021లో 1200 గాజాల స్థలాన్ని ఇతరులకు విక్రయించినట్టు తెలిపారు. 2023 మార్చిలో తాను అమెరికాకు వెళ్లిన సమయంలో వారి స్థలములో పార్కును ఏర్పాటు చేసారన్నారు. కోనుగోలుదారులు వచ్చి పొజిషన్లోకి వస్తుంటే వారిని రానివ్వకపోవడంతో వారు కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చి వారిరువురు తగులాడారని, వారి వారి గొడవకు తనను మద్యలోకి లాగడం సరికాదన్నారు. మల్లంపేటకు చెందిన ఓ కౌన్సిలర్ భర్త ఆంజనేయులు కావాలనే కాలని వాసులను రెచ్చగొడుతున్నారన్నారు. ఇకపై ఊరుకునేది లేదని తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. అగ్రిమెంట్ ప్రకారం పూర్తిగా డబ్బులు చెల్లించిన వారికి విల్లాలు అప్పగించామని, డబ్బులు పూర్తిగా చెల్లించని వారు బలవంతంగా తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా ఇండ్లల్లోకి ప్రవేసిస్తున్నారన్నారు. డబ్బులు చెల్లిస్తే అందరికి పొజిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకతను విద్యుత్ మీటర్ దొంగిలించారని సంతకం ఫోర్జరీ చేశారని, అనేకం జరిగాయని తెలిపారు. యాజమాన్యం సంస్థ అడ్వకేట్ నాగరాజు మాట్లాడుతూ కొనుగోలు దారులకు జవాబుదారీగా నిర్మాణ సంస్థ కట్టుబడి ఉంటుందని అలాగే సంస్థకు డబ్బులు చెల్లించని కొనుగోలు దారులు అక్రమంగా ప్రవేశిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవనిహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస నిర్మాణ సంస్థ అడ్వొకేట్ నాగరాజు, వెంకయ్య, వినరు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.