కాంగ్రెస్‌ అభివృద్ధి చూడలేకే ఆరోపణలు

కాంగ్రెస్‌ అభివృద్ధి చూడలేకే ఆరోపణలు– షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని, రేవంత్‌ రెడ్డి ముఖ్య మంత్రి గెలుపొందాక రైతులకు ధైర్యం వచ్చిందని షాద్‌ నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ బీజేపీ తీరుపై ధ్వజమెత్తారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రూ.2 లక్షల రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సీఎం రేవంత్‌ రెడ్డి రైతులకు న్యాయం చేస్తుంటే బీజేపీ కేంద్రమంత్రి బం డి సంజరు, మహబూబ్‌ నగర్‌ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ లేనిపోని విమర్శలు ప్రభుత్వంపై చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజరు తె లంగాణ రైతులకు ఏంచేశారు చెప్పాలని మీడియా ముఖంగా నిలదీశారు. పాలమూరు ఎంపీ డీకే అరుణ మీ డియా ముందు ఎన్నో అడ్డం పొడవు మాటలు మాట్లాడు తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు బీజేపీ ఎంపీలు తెలంగాణకు ఏమి చేశారో చెప్పాలని, దేశంలో బీజేపీ ప్ర భుత్వం అధికారంలో ఉన్న కూడా తెలంగాణకు వారు ఒ రగబెట్టింది ఏమీ లేదని వివరించారు. రుణమాఫీలో సాంకేతిక లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వం రుణమా ఫీని రైతులకు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని అబద్ధాలు చెప్పడం బీజేపీకి తగదని హెచ్చరించారు. రేవంత్‌ రెడ్డిలో మరో రాజశేఖర్‌ రెడ్డిని రైతులు చూస్తున్నారని, రైతుల పా లిట ముఖ్యమంత్రి ఒక వరమని ఎమ్మెల్యే కొనియాడారు.