నవతెలంగాణ విలేకరి కూతురు ను పరామర్శించిన ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య

నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు ఏరియా హాస్పిటల్ లో పెద్దాపరేషన్ అయి వైద్యం పొందుతున్న తాడ్వాయి మండల నవతెలంగాణ విలేకరి తమ్మల సమ్మయ్య గౌడ్, కూతురు ఐలి సాహితిని తాడ్వాయి మండల ప్రత్యేక అధికారి, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య బుధవారం సందర్శించి, పరామర్శించారు. ఆస్పత్రి సూపర్డెంట్, వైద్యాధికారులతో మాట్లాడారు. సాహితికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సాహితి ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు.