ఆదివాసీల అరణ్య రోదనకు ఉపశమనం…

– మంచినీటి కి ఐటిడిఎ తాత్కాలిక ఏర్పాటు…
– నవతెలంగాణ కథనానికి స్పందన..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆదివాసీల అరణ్య రోదన కు తాత్కాలిక ఉపశమనం కలిగింది.నవతెలంగాణలో మంగళవారం ప్రచురితం అయిన కథనానికి ఐటిడిఎ అధికారులు స్పందించారు. బచ్చువారిగూడెం పంచాయితీ ట్రాక్టర్ ట్యాంకర్ తో రేగళ్ళకు మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఈ కథనం ద్వారా సమాచారం తెలుసుకున్న ఐటిడిఏ ప్రతీక్ జైన్ ఏ.టీ.డబ్ల్యు.ఓ చంద్రమోహన్ ఈ సంఘటన పై నివేదిక కోరారు. స్పందించిన ఆయన ఎం.పి.డి.ఒ శ్రీనివాస్ తో మాట్లాడి స్థానిక పంచాయితీ ట్రాక్టర్ తో నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో సిబ్బంది ట్యాంకర్ తో నీటి సరఫరా చేపట్టారు.