49వ జాతీయ వాటర్ పోలో క్రీడలకు ఎంపికైన అల్లే తన్మయి చంద్ర

–  క్రీడాకారిణికి మంత్రి హరీశ్ రావు అభినందనలు
నవతెలంగాణ – సిద్దిపేట
49వ నేషనల్ జూనియర్ వాటర్ పోలో గేమ్స్ కి   సికింద్రాబాద్ స్విమ్మింగ్ ఫూల్ లో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించగా  సిద్దిపేట జిల్లాకు చెందిన అల్లే తన్మయి
చంద్ర ప్రతిభ చాటి, చెన్నైలో జరగబోయే వాటర్ పోలో నేషనల్ గేమ్స్ కి  తెలంగాణ రాష్ట్రం తరఫున ఎంపిక కావడం జరిగిందని కోచ్ ప్రవీణ్ తెలిపారు. బుదవారం ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మొట్టమొదటిసారిగా  49వ జాతీయ జూనియర్ వాటర్ పోలో గేమ్స్ కి క్రీడాకారిణి ఎంపిక కావడం పట్ల ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారని తెలిపారు.  జిల్లా స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్ పాల సాయిరాం, డి.వై.ఎస్.ఓ. నాగేందర్, సిద్దిపేట జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బర్ల మల్లికార్జున్, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు కోచ్ లు హర్షం వ్యక్తం చేసి, ఆమెను అభినందించారు.