మిత్రపక్షాలనే ఒప్పించలేదు..దేశాన్ని ఎలా రక్షిస్తారు..?

– కాంగ్రెస్‌పై కేటీఆర్‌ సెటైర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మోసం కాంగ్రెస్‌ నైజమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఎక్స్‌ వేదికగా ఆయన ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. నయవంచనకు నిలువెత్తు రూపం కాంగ్రెస్‌ అనీ, అందుకే ఆదిలోనే ఇండియా కూటమికి బీటలు వారిందని తెలిపారు. మిత్రపక్షాలను ఒప్పించలేని కాంగ్రెస్‌ దేశ ప్రజలను ఏం మెప్పిస్తుంది? అని ప్రశ్నించారు.