– కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ : భారతదేశం జీ20 ప్రెసిడెన్సీ, లీడర్స్ సమ్మిట్ కోసం రూ.1,310 కోట్ల రూపాయలు కేటాయించినట్టు కేంద్రం తెలిపింది. ”2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు జీ20 ప్రెసిడెన్సీ, సమ్మిట్ కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) కు ఆర్థిక మంత్రిత్వ శాఖ కేటాయించిన బడ్జెట్ రూ. 320 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరం లో ఇది రూ. 990 కోట్లు” అని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు.
జీ20 సమ్మిట్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ కేటా యించిన మొత్తం బడ్జెట్‌పై టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమి చ్చారు. డిసెంబర్ 1, 2022 నుంచి ఈ సంవత్సరం నవంబర్ 30 వరకు భారత్‌లోని 60 నగరాల్లో 250 కంటే ఎక్కువ అధికారిక ట్రాక్ సమావేశాలు, వందలాది సంబంధిత ఈవెంట్‌లు నిర్వహించబడ్డాయి. అలాగే, ఈ ఏడాది సెప్టెంబర్ 9-10 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 లీడర్స్ సమ్మిట్ జరిగింది. ఈ సమావేశానికి జీ20 సభ్యదేశాల అధ్యక్షలు (కొన్ని దేశాలు మినహా) హాజరైన విషయం తెలిసిందే.