ఆర్యవైశ్య సంఘం భవనానికి స్థలం కేటాయించండి..

నవతెలంగాణ – మీర్ పేట్
ఆర్యవైశ్య సంఘం భవనానికి స్థలం కేటాయించాలని  బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం ట్రస్ట్ సభ్యులు  మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నిర్మాణ కమిటీ ట్రస్టు చైర్మన్ తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్తా, అధ్యక్షులు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ మహేశ్వరం నియోజవర్గం బాలాపూర్ మండల పరిధిలో అత్యధికంగా ఆర్యవైశ్యులు నివాసం ఉంటున్నారని తెలిపారు. అందుకు మా ఆర్యవైశ్య సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరామన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఇరువెంటి సురేష్ గుప్తా, కోశాధికారి గందే వెంకటేశ్వర్లు గుప్తా తదితరులు పాల్గొన్నారు.