నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీసీలకు జనాభా ప్రకారం టికెట్లు కేటాయించాలని బీసీ రాజ్యాంధికార సమితి జాతీయ అధ్యక్షులు దాసు సురేష్ కాంగ్రెస్ పార్టీని కోరారు. ఈమేరకు గురువారం హైదరాబాద్‌లోఆ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రేకు బీసీల వివరాలతో కూడిన నివేదికను అందజేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల అవకాశాలను ద్విగుణీకృతం చేసే దిశగా వారి జనాభా 60శాతం పైనున్న 42 నియోజకవర్గాలు, 50 శాతం పైచిలుకు జనాభా ఉన్న 72 స్థానాల వివరాలను సమర్పించారు. కారక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి నేతలు బండారి పద్మావతి, భోగ శ్రీనివాస్, పైరసాని దుర్గేష్, ఉమా, రాధాకష్ణ, కొత్తపల్లి బాయమ్మ, భండారి వైధ్యనాథ్, గీసబోయిన ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు.