హైదరాబాద్ : నిర్మాణ నిర్వహణ, రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ సంస్థ మ్యాన్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ నిధుల సమీకరణ కోసం 3,50,46,100 వారెంట్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. రూ.155 ధరతో వారెంట్ ఇష్యూ ధరతో మొత్తం రూ.543 కోట్లు నిధులను పొందనున్నట్టు వెల్లడించింది. దీనికి ఆ సంస్థ బోర్డు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఈ ఇష్యూలో పెట్టుబడులు పెట్టడానికి క్వాంట్ మ్యూచువల్ ఫండ్, ఫోర్బ్స్ ఇఎంఎఫ్, సియోస్ గ్లోబల్ ఆఫర్చూనిటీస్ ఫండ్, అరీస్ ఆపర్చూనిటీస్ ఫండ్ తదితర సంస్థలు ముందుకు వచ్చినట్లు మ్యాన్ ఇన్‌ప్రా తెలిపింది.