అశ్వారావుపేట మున్సిపాలిటీకి అధికారుల కేటాయింపు..

Allotment of officials to Ashwaraopeta Municipality..– ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్
– పూర్తి స్థాయి కమీషనర్ గా సుజాతకు బాధ్యతలు..
– ప్రత్యేక అధికారిగా షాహిద్ మసూద్
నవతెలంగాణ –  అశ్వారావుపేట
నూతనంగా ఏర్పాటు అయిన నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట మున్సిపాలిటీకి అధికారులను కేటాయిస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి శ్రీదేవి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.పాల్వంచ మున్సిపాలిటీ కమిషనర్ సుజాత కు అశ్వారావుపేట కమీషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇన్చార్జి కమీషనర్ గా కేటాయించారు. అలాగే వరంగల్ ఆర్.డీ.ఎం.ఏ మున్సిపల్ కమీషనర్ షాహిద్ మసూద్ ను ప్రత్యేకాధికారి గా నియమించారు.తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయితీకి మున్సిపాలిటీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే గవర్నర్ అనుమతితో గెజిట్  నోటిఫికేషన్ జారీ చేసింది. అశ్వారావుపేట మేజర్ (గ్రామ పంచాయితీ తో పాటు గతంలో ఇదే పంచాయితీ పరిధిలో ఉండి ప్రత్యేక గ్రామ పంచాయితీలు గా విడిపోయిన పేరాయిగూడెం,గుర్రాల చెరువు గ్రామ పంచాయితీల ను కలుపుతూ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు గా నిర్ధారించింది.తెలంగాణ మున్సిపాలిటీ (అమెండ్మెంట్) యాక్ట్, 2025, (యాక్ట్ నెం.4 ఆప్ 2025), తేదీ: 14.01.2025 ప్రకారం జీవో ఎం.ఎస్. నం. 14 ఎంఏ ఆన్ డ్యూటీ (ఎంఏ), డి.ఎం.పీ.టీ, జనవరి 25, 2025 న అధికారికంగా మున్సిపాలిటీ హోదా కల్పించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు.ఇందుకు పరిపాలనా సౌలభ్యం కోసం మున్సిపాలిటీ కి  అవసరమైన అధికారుల కేటాయించారు. తక్షణమే మున్సిపాలిటీ పరిధిలోని మూడు గ్రామ పంచాయితీల్లో నిర్దేశించిన ప్రాసీడింగ్స్ ఫిబ్రవరి 6 వ తేదీ లోపు పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. అతి త్వరలోనే బాధ్యతలు స్వీకరించ నున్నట్లు ఇన్చార్జి  కమీషనర్ సుజాత నవతెలంగాణ కు తెలిపారు.