
ఆరోగ్య కార్యకర్తల శిక్షణ కొరకు కౌన్సిలింగ్ పద్ధతిలో సీట్ల కేటాయింపు జరిగిందని అదనపు కలెక్టర్ బి.ఎస్.లత అన్నారు. బుదవారం సమీకృత కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లాలోని మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం శిక్షణ కొరకు కౌన్సిలింగ్ అలాగే మెరిట్ పద్ధతి ద్వారా సీట్ల కేటాయింపు ఎంపిక కమిటీ చైర్ పర్సన్ బి. ఎస్ లత అదనపు కలెక్టర్ రెవిన్యూ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ అనునయి అలాగే ఏఎన్ఎం శిక్షణ సంస్థల ప్రిన్సిపల్ లు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాల అధికారి డాక్టర్ పి వెంకటరమణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగినది. విద్యార్థులకు మెరిట్ మరియు కౌన్సిలింగ్ పద్ధతిలో సీట్ల కేటాయింపు ఎంపిక ప్రక్రియ జరిగినదని అన్నారు.