బీఈడీ కోర్సుల్లో సీట్ల కేటాయింపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఈడీ కోర్సులో సీట్ల కేటాయింపు వివరాలను టీఎస్‌ సెట్స్‌ (అదర్స్‌) అడ్మిషన్స్‌ – 2023 కన్వనర్‌ ప్రొఫెసర్‌ పి.రమేశ్‌ బాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో ఫేస్‌లో కన్వీనర్‌ కోటాలో 9,593 సీట్లుండగా 8,338 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్‌ ఇచ్చారు. వీరిలో 6,223 మందికి సీట్లను కేటాయించారు. సీటు కేటాయించబడిన విద్యార్థుల్లో ట్యూషన్‌ ఫీజు కట్టాల్సిన వారు ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు. తర్వాత ఫీ రిసిప్ట్‌, జాయినింగ్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ట్యూషన్‌ ఫీ రిసిప్ట్‌తో అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 4 లోపు కేటాయించబడిన కాలేజీలో రిపోర్ట్‌ చేయాలని విద్యార్థులకు సూచించారు.