నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) మొదటి విడత కౌన్సెలింగ్‌లో 753 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఈ మేరకు పీఈసెట్ ప్రవేశాల కన్వీనర్ పి రమేష్‌బాబు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో 967 మంది వెబ్‌ఆప్షన్లు నమోదు చేశారని తెలిపారు. బీపీఈడీలో 1,437 సీట్లు, డీపీఈడీలో 300 సీట్లు కలిపి మొత్తం 1,737 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. మొదటి విడతలో బీపీడీలో 600 మందికి, డీపీఈడీలో 153 మందికి కలిపి 753 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఈనెల 28 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించాలని కోరారు. ఈనెల 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.