యూనివర్సిటీకి సమాచారం ఇవ్వకుండా.. హైకోర్టుకు స్థలం కేటాయింపు

– జీవో నెంబర్‌ 55 రద్దు చేయాలి
– ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కె.వై ప్రణరు, కార్యదర్శి బి.శంకర్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
అగ్రికల్చర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీలకు సమా చారం ఇవ్వకుండా ప్రభుత్వం 55 జీవోను విడుదల చేసి ఎంతో విలువచేసే యూనివర్సిటీ భూములను హైకోర్టు కేటాయించడం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేవై ప్రణరు, కార్యదర్శి బి.శంకర్‌ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించు కోవాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హె చ్చరించారు. శనివారం ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా కమి టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 55 ద్వారా నూతన హైకోర్టు భవనాన్ని నిర్మించేందుకు రాజేంద్ర నగర్‌లో 100 ఎకరాలు కేటాయించారని అన్నారు. ఈ భూమిని తీసుకుంటున్నట్టు కూడా యూనివర్శీటీకి కనీ సం సమాచారం ఇవ్వలేదన్నారు. ఉద్యానవన యూనివ ర్శీటీ భూమి 57.5 ఎకరాలు, వ్యవసాయ యూనివర్శీటీ భూమి 42.5 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయించా రని అన్నారు. ఈ భూమిని హైకోర్టు కేటాయించడం అంటే విద్యార్థుల చదువులకు నష్టం చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై యూనివర్శీటీ అధికా రులు కోర్ట్‌కు వెళ్లాలని కోరారు. గతంలో వైఎస్‌ రాజ శేఖర్‌రెడ్డి హయాంలో కూడా భూమిని తీసుకోవాలని అనుకున్నప్పుడు అప్పటి వీసీ రఘవీర్‌రెడ్డి అడ్డు కున్నారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రెగ్యూలర్‌ వీసీ లేకపోవడం, ఐఏఎస్‌ అధికారి రఘనందన్‌రావు ఇన్‌చార్జి వీసీగా ఉండటం వలన కనీసం అభ్యంతరం తెలుపలేదన్నారు. తక్షణమే యూనివర్శీటీ భూములను యూనివర్శీటీకే ఇవ్వాలని, హైకోర్టు భవనానికి ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని, హైకోర్టును వేరే చోట నిర్మించాలని డిమాండ్‌ చేశారు.