మా దీక్షకు అనుమతివ్వండి

– డీజీపీకి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జీవో నెంబర్‌ 3కు సంబంధించి భారత జాగృతి ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించ తలపెట్టిన దీక్షకు అనుమతివ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనతో ఫోన్‌లో మాట్లాడిన కవిత జీవో 3 వల్ల మహిళలకు తీవ్ర అన్యాయం జరగనుందని తెలిపారు.