పెండింగ్‌ డీఏల విడుదలకు అనుమతివ్వండి

పెండింగ్‌ డీఏల విడుదలకు అనుమతివ్వండి– సీఈవో వికాస్‌రాజ్‌కు టీఎన్జీవో వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల విడుదలకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను టీఎన్జీవో కేంద్ర సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ను బుధవారం హైదరాబాద్‌లో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న మూడు డీఏల విడుదల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు కస్తూరి వెంకట్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు ముజీబ్‌ హుస్సేనీ, కేంద్రసంఘ ప్రతినిధి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.