అల్లు అర్జున్‌కి కథ నచ్చడంతో మా నమ్మకం మరింత పెరిగింది

అల్లు అర్జున్‌కి కథ నచ్చడంతో మా నమ్మకం మరింత పెరిగింది‘మంగళవారం’ సినిమాతో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ కుమార్తెహొస్వాతి రెడ్డి గునుపాటి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు అజరు భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్‌ వర్క్స్‌ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్‌ పతాకంపై ఎం.సురేష్‌ వర్మతో ఈ చిత్రాన్ని నిర్మించారు. పాయల్‌ రాజ్‌పుత్‌, ‘రంగం’ ఫేమ్‌ అజ్మల్‌ అమీర్‌ జంటగా రూపొందిన ఈ సినిమా ఈనెల 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు స్వాతి, సురేష్‌ వర్మ మీడియాతోహొమాట్లాడారు.
‘మా కుటుంబం ఎంటర్టైన్మెంట్‌ ఇండిస్టీలో 30 ఏళ్ల నుంచి ఉంది. నాకూ చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి. అజరు చెప్పిన కథ బాగా నచ్చింది. ఈ కథ మీద నాకు మరింత కాన్ఫిడెన్స్‌ పెరగటానికి కారణం అల్లు అర్జున్‌ వల్ల సినిమా చేయాలనే ధైర్యం రావడం. ‘ఎందుకు కలగా వదిలేయాలి. నువ్వు ట్రై చెరు. చేసినప్పుడు నీతో ఎవరినైనా పార్ట్నర్‌ ఉంటే బావుంటుంది’ అని అల్లు అర్జున్‌ చెప్పాడు. సురేష్‌ వర్మకి కూడా సేమ్‌ డ్రీమ్‌ ఉండటంతో ఇద్దరం కలిసి ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశాం.హొనిర్మాతగా అడుగులు వేస్తున్నప్పుడు పెద్ద హీరోల సినిమాలతో ప్రెజర్‌ పెట్టుకోవడం కంటే చిన్న సినిమా చేయడం మంచిదని అనుకున్నా. ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న స్పందనను కలలో కూడా ఊహించలేదు.హొకమర్షియల్‌ సినిమా, లవ్‌ స్టోరీ చేయడం కంటే డార్క్‌ థ్రిల్లర్‌ ఎలా వస్తుందో ఊహించడం కష్టం. అజరు భూపతి నేరేషన్‌ విని ‘ఈ మూవీ చేస్తే బావుంటుంది’ అనిపించింది. సినిమాలో ఓ సందేశాన్ని చెప్పిన విధానం బాగా నచ్చింది. ఇందులో మ్యూజిక్‌, ఎమోషన్స్‌, మెసేజ్‌… అన్నీ ఉన్నాయి. విడుదలకు ముందు టేబుల్‌ ప్రాఫిట్‌ రావడం ఎవరికైనా సంతోషం కలిగించే వార్తే కదా! మా మొదటి ప్రయత్నానికి అందరి నుంచి మంచి మద్దతు లభించింది. ఈ మూమెంట్‌ని ఎంజారు చేస్తున్నాం.హొఅలాగే ట్రైలర్‌ ట్వీట్‌ చేసి నా గురించి చిరంజీవి బాగా చెప్పడమనేది నాకు చాలా ఎమోషనల్‌ మూమెంట్‌’
– స్వాతి రెడ్డి
”మంగళవారం’ కంటే ముందు రెండు మూడు కథలు విన్నామంతే! ‘ఆర్‌ఎక్స్‌ 100′ టైంలో అజరు భూపతి ఈ కథ నాకు చెప్పారు. ఎగ్జైట్‌ చేసిన కథ ఇది. అజరు తన సొంత సంస్థలో చేయాలని అనుకున్నాడు. కథ బాగా నచ్చడంతో నేను, స్వాతి నిర్మాతలుగా దీన్ని ప్రొడ్యూస్‌ చేశాం. ఇది డార్క్‌ థ్రిల్లర్‌ అయినప్పటికీ… ఈ సినిమాలో ఎమోషన్స్‌ అన్నీ ఉన్నాయి. ముందు నుంచి రెగ్యులర్‌ సినిమా చేయాలని మేం అనుకోలేదు. అదీ ఈ సినిమా చేయడానికి ఓ కారణం. ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంది. ముఖ్యంగా పాయల్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. తను చాలా కష్టపడింది.హొఇందులో ఫేస్‌ మాస్క్‌ డిజైన్‌ ఐడియా అజరు భూపతిదే. ఫస్ట్‌ డే నుంచి అల్లు అర్జున్‌ మమ్మల్ని ఎంకరేజ్‌ చేశారు. పోస్టర్‌ రిలీజ్‌ నుంచి ప్రతి విషయంలో ఎగ్జైట్‌ అయ్యారు. తెలుగుతోపాటు మిగతా భాషల నుంచి కూడా మంచి స్పందన ఉంది. తమిళంలో ట్రైడెంట్‌ రవి విడుదల చేస్తున్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. నేను చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌. చిన్నప్పుడు చూస్తే చాలు అని ఫీలయ్యా. ఈ రోజు మా సినిమాకు ఆయన ట్వీట్‌ చేయడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి’.
– సురేష్‌ వర్మ