దర్శకుడు సుకుమార్ భార్య తబిత సమర్పణలో నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఇందులో రావు రమేష్ కథానాయకుడు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు.హొపీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్యహొనిర్మించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా, సుకుమార్ విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫస్ట్ టికెట్ అల్లు అర్జున్‌కి ప్రజెంట్ చేశారు. ‘టికెట్ ఎంత పెట్టి కొంటున్నారు?’ అని సుమ అడగ్గా,. ”సుకుమార్ సినిమా. కోటి రూపాయలు అయినా పెడతా” అని చెప్పారు అల్లు అర్జున్.హొ
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ‘సుకుమార్ వైఫ్ తబితా సుకుమార్ ప్రొడ్యూస్ చేశారు. సుకుమార్‌కి ఏమాత్రంహొసంబంధం లేకుండా ఆవిడ ఈ సినిమా చేశారు. అందుకు సభాముఖంగా అభినందిస్తున్నా. తెలుగులో తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందులో రావు రమేష్ లేకపోతే చాలా క్యారెక్టర్స్హొరావు. ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇటువంటిహొకథలు ఎక్కువ రావాలనిహొకోరుకుంటున్నాను. ఇక, ‘పుష్ప 2′ విషయానికి వస్తే… ఈ సినిమా వస్తున్న విధానం అభిమానులకు నచ్చుతుంది. డిసెంబర్ 6న అసలు తగ్గేది లే. ఇది మాత్రం ఫిక్స్’ అని అన్నారు.హొ
‘మా ఆవిడ ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తుంది. మా ఆవిడ సినిమా చూసింది. పగలబడి నవ్వాననిహొచెప్పింది. మా ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకు వెళ్ళింది. అందరికీ సినిమా నచ్చింది. ఒక రోజు హోమ్ థియేటర్లో చూశా. నాకు చాలా బాగా నచ్చింది. బన్నీ రాకతో ఇది పెద్ద సినిమా అయ్యింది. రావు రమేష్ లాంటి నటులు హీరో పాత్రలు చేస్తే చాలా కథలు బయటకు వస్తాయి. క్లైమాక్స్ వచ్చేసరికి నాకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. లక్ష్మణ్ కార్య అద్భుతంగా తీశాడు’ అని దర్శకుడు సుకుమార్ చెప్పారు. తబితా సుకుమార్ మాట్లాడుతూ, ‘లక్ష్మణ్ నాకు షో వేసినప్పుడు చాలా ఎంజారు చేశా. ఇది చిన్న స్థాయిలో ప్రేక్షకుల్లోకిహొవెళ్ళకూడదు, పెద్దగా వెళ్లాలని నేను ప్రజెంట్ చేస్తానని లక్ష్మణ్ కార్యతోహొచెప్పాను’ అని అన్నారు. రావు రమేష్ మాట్లాడుతూ, ‘మారుతి నగర్ సుబ్రమణ్యానిదిహొఓ యుద్ధం. అతను ఓ నూతిలో కప్ప. అన్నీ తెలుసన్నట్టు కనిపిస్తాడు. కానీ, ఏమీ తెలియదు. నన్ను అప్డేట్ చేయమని కొడుకును అడుగుతాడు. ఇటువంటిహొఅద్భుతమైన ప్రపంచాన్ని దర్శకుడు లక్ష్మణ్ కార్య సష్టించాడు’ అని తెలిపారు.
ఇలాంటి కథలు మరిన్ని రావాలి : అల్లుఅర్జున్
10:08 pm