– పాల్గొన్న నిజాంపేట్ డిప్యూటీ మేయర్
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉగాది పురస్కరిం చుకొని మంగళవారం ఉదయం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు రాము స్వామితో ఉగాది నూతన సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మాట్లాడుతూ తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభం అవుతుందని అన్నారు. ఈ నూతన సంవత్సరం అందరికి శుభం, అన్నిట్లో విజయం చేకూరాలని కోరుతూ కార్పొరేషన్ ప్రజలకు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అభయాంజనేయ స్వామి ఆలయ చైర్మెన్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి , గ్రామ పెద్దలు లీడర్ నర్సింహా రెడ్డి, సంజీవ్ రెడ్డి,నగేష్ చారీ,జనార్దన్ రెడ్డి,కార్పొరేటర్లు సురేష్ రెడ్డి ,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యలు తల్లారి వీరేష్ , సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, బొర్రా చందు,బాల వెంగయ్య చౌదరి, ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి,అభయాంజనేయ స్వామి ఆలయ ప్రెసిడెంట్ రాజ్ మోహన్ రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు నాగరాజ్ యాదవ్, తల్లారి సాయి, లక్ష్మా రెడ్డి, సుధాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, బొర్రా అశోక్, శ్రీశైలం యాదవ్, కుమార్ యాదవ్, బక్క మల్లేష్, ప్రేమ్ కుమార్,ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, అజరు వర్మ,గ్రామస్తులు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.