శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం

నవతెలంగాణ – చండూరు 
క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం  శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. మొదట పంచాంగపూజ నిర్వహించిన పండితులు శ్రీ చెరివెళ్లి హరికిషన్ శర్మ  పంచాంగములోని రాశి ఫలాలను, దేశ రాష్ట్ర కాలమాన పరిస్థితులను చదివి వినిపించారు. అనంతరం హరికిషన్ శర్మతో పాటు పాల్గొన్న పండితులు ప్రవీణ్ శర్మ, అజయ్ శర్మ, సత్యనారాయణ, వెంకటేశ్వర్లను శాలువాలతో సత్కరించారు.  ఈ కార్యక్రమంలో.. ఉభయ దేవాలయాల ట్రస్ట్ చైర్మన్ కోమటి వీరేశం, దేవాలయ కమిటీ చైర్మన్ రావిరాల నగేష్, పద్మశాలి సంఘం అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు గుర్రం బిక్షమయ్య , పులిపాటి ప్రసన్న, జూలూరు ఆంజనేయులు, పున్న ధర్మేందర్, గంజి శ్రీనివాసులు, గంజి యాదగిరి, తిరందాసు గోపాల్, చిలుకూరి రామ్మూర్తి, చెరుపల్లి అంజయ్య, చిట్టిప్రోలు వెంకటేశం, పులిపాటి గోపయ్య, చెరుపల్లి కృష్ణయ్య, ఏలి సుధాకర్ కోమటి ఓంకారం, తిరందాసు గోపాల్, రాపోలు వెంకటేశం, ఆనందపు వీరేశం, కలిమికొండ మహేష్, మార్కండేయ యువజన సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యులు గంజి గంగాధర్, అశోక్, చిరంజీవి, రవికుమార్, మణికంఠ చిట్టిప్రోలు మహేష్, గంజి బిక్షం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.