శివ మార్కండేయ ఆలయంలో పంచాంగ శ్రవణం

నవతెలంగాణ – ఏర్గట్ల
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్గట్ల మండలకేంద్రంలోని శివ మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగను జరిపారు. ఆలయార్చకులు రాకేష్ శర్మ శివ లింగానికి పంచామృతాభిషేకం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి వితరణ చేసి, పంచాంగ శ్రవణం నిర్వహించారు.