బాదంపాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం

నవతెలంగాణ – వలిగొండ రూరల్
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పౌష్టికాహారంగా బాదంపాలను సేవా భారత్ కార్యక్రమం ద్వారా అందించడం సంతోషంగా ఉందని సేవాభారత్ వ్యవస్థాపకులు అమ్మానాన్న అనాధాశ్రమం చైర్మన్ గట్టు శంకర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండడం ప్రైవేట్ పాఠశాల వైపు ప్రజల మొగ్గు చూపుతూ ఉండడంతో పాఠశాల అభివృద్ధి కోసం తమ వంతు కృషి  చేస్తామని ఆయన అన్నారు. అందుకోసం వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో, ప్రాథమిక, మండల  పరిషత్ పాఠశాలలలో ఫ్రిజ్ లు, సంవత్సరానికి సరిపడా బాదంపాలను అందజేశారు.అదేవిధంగా ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు ఫెడరేషన్ ప్రెసిడెంట్ విరాహత్ అలీ హాజరై ఆయన మాట్లాడుతూ సేవాభారత్ కు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని  ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కా వెంకట్ రెడ్డి, ఎంపిటిసి బండారు ఎల్లయ్య, విశిష్ట అతిథులు వలిశెట్టి లక్ష్మీ శేఖర్, ప్రముఖ గాయకులు సింహ, ప్రధానోపాధ్యాయులు శ్రావణ్ కుమార్,ఎస్ఎంసి మాజీ చైర్మన్ ఏసయ్య, చేయూత ఫౌండేషన్ చైర్మన్ వాకిటి రామ్ రెడ్డి, వేముల హరికృష్ణ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.