నవతెలంగాణ-లక్షెట్టిపేట
పట్టణంలోని కోర్టు వద్ద ఏర్పాటు చేసిన శివ గణేష్ మండపం వద్ద ముస్లిం మైనారీటీలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాని పట్టణ సీఐ అల్లం నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా సోదర భావంతో గణేష్ మండపం వద్ద ముస్లీమ్ మైనార్టీలు అన్నదాన వితరణ ఏర్పాటుచేయడం గొప్పవిషయం అన్నారు. పట్టణంలో ప్రతి ఏటా శివరాత్రి, గణేష్ నవరాత్రులలో ముస్లీమ్ మైనారిటీలు చేసే సేవలను అభినందించారు. నిరంతరం ఇలానే కొనసాగాలని అందరూ ఐక్యతతో ఉండి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని కోరారు. అనంతరం మండపంలో అందరితో కలిషి పూజలు నిర్వహించి నారాయణ సేవలో (అన్నదానంలో) పాల్గొని వడ్డన చేశారు. ఈకార్యక్రమంలో సీఐతో పాటు ఎస్‌ఐ పి సతీష్, మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ షాహిద్ ఆలీ, ప్రధాన కార్యదర్శి నవాబ్ ఖాన్, ముస్లీమ్ మైనారిటీ యువకులు అన్వర్, షెఫీ, షాహిద్, జావిడ్, హఫీజ్, షాజిద్, హాసాద్, బిలాల్, ఇంతియాజ్, ఎజాస్, హాజి, సమీదున్‌తో పాటు కమిటీ సభ్యులు కట్ల చంద్రయ్య, పారువెళ్లి శ్రీనివాస్, బుద్దే సత్యం, దండే శ్రీనివాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.