– సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవ్ కార్యక్రమాలు
– ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యుతోపాటు ఉన్నత వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం సింగరేణి సీఈఆర్ క్లబ్‌లో మూడు రోజులపాటు జరగనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి బాలోత్సవ్‌ను సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కూనంనేని మాట్లాడుతూ వెనుకటి రోజుల్లో గురుకులాల్లో మంచి విద్యాభోదన జరిగేదని, నేటి రోజుల్లో విద్య ఆధునిక పోకడలతో అస్తవ్యస్తంగా తయారైందన్నారు. పాశ్యాత్య పోకడలతో భారత సంస్కృతికి చేటు కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుÛలు మానసికంగా బలోపేతం అయ్యే వ్యక్తిత్వాన్ని పెంపొందించే విద్య నేడు అవసరమని అన్నారు. కేవలం విద్యకే ప్రాధాన్యత ఇవ్వకుండా క్రీడా, సాంస్కృతిక రంగాలవైవు విద్యార్యులన్ను పోత్సహిందాల్సిన భాద్యత విద్యాసంస్థలపై ఉందన్నారు. ఉత్తమ ప్రతిభకనబర్చి ప్రతీ యేటా రాష్ట్ర స్థాయి బాలోత్సవ్ పోటీలను నిర్వహిస్తూ విద్యార్థులను పోత్సహిన్తున్న మద్దెల శివకుమార్‌తోపాటు కమిటీ నభ్యులు అభినందనీయులని, వారు చేస్తున్న కృషికి అన్ని విధాలా సహకరిస్తానని కూనంనేని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా, బాలోత్సవన్ నిర్వహకులు మద్దెల శివకుమార్, జడ్పీ చైర్మన్ చంద్రశేఖర్ రావు, గొల్లపల్లి దయానంద్, అందెల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.