వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మండల ప్రత్యేక అధికారి వి.ఉదయ్ కుమార్ అన్నారు.శుక్రవారం మండలంలో పర్యటించిన ఆయన ముందుగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, అమ్మ ఆదర్శ పాఠశాల, పురుగుల మందుల దుకాణం తనిఖీ చేశారు.ధరల పట్టిక బోర్డుపై ఉంచాలని,రైతులు మందులు తీసుకున్నాక రసీదులు ఇవ్వాలని సూచించారు.అనంతరం నీల్వాయి ప్రాథమిక పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాల,వరద దాటికి కొట్టుకుోయిన ామడ వాగును పరిశీలించారు.అలాగే చౌక ధరల దుకాణం తనిఖీ చేసి బియ్యం సరఫరాలో ఇబ్బందులు ఉంటే తెలపాలని సూచించారు.వేమనపల్లి నుండి సుంపుటం గ్రామ శివారులోకి ప్రాణహిత బ్యాక్ వాటర్ రాకపోకలు నిలిచిపోగా సందర్శించి ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే అత్యవసరమైతే తప్ప గ్రామం విడిచి రావద్దని సూచించారు.అనంతరం బాలుర ఆశ్రమ పాఠశాల తనిఖీ చేశారు.పాఠశాల పరిసరాలు తరగతి గదులను పరిశీలించారు.వర్షాకాలం వ్యాపిస్తున్న తరుణంలో ఎప్పటికప్పుడు పరిసరాలను గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం పెట్టాలన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచించారు.అలాగే మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.వీరి వెంట ఎంపీడీవో దేవేందర్ రెడ్డి,కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మయూరి, స్టాఫ్ నర్స్ శ్రీవాణి,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.