– తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ విరాళం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బాధతుల సహాయార్థం తమ వంతు ఆర్థిక సహాయాన్ని తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (టీటీడీపీసీ) ప్రకటించింది. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. టీటీడీపీసీ సెక్రటరీ వినోద్ బాల మాట్లాడుతూ, ‘ఎలాంటి ప్రకృతి విపత్తులు ఎదురైనా అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పారు. ‘260 మంది సీరియల్ ప్రొడ్యూసర్స్‌లో 60 మందే ఇప్పుడు యాక్టీవ్‌గా సీరియల్స్ చేస్తున్నారు. అయినా 5 వేల నుంచి 25 వేల వరకు మీకు తోచినంత విరాళం ఇవ్వాలని కోరాం. ఈ డబ్బుకు మరికొంత మా అసోసియేషన్ ఫండ్ నుంచి యాడ్ చేసి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఎంత కలెక్ట్ అయితే అంత డబ్బు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేస్తాం’ అని టీటీడీపీసీ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు చెప్పారు.