భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలుస్తూ హీరో సాయి దుర్గతేజ్ తన వంతు సాయంగా ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్‌ను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అందించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ వరద బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయల విరాళాన్ని మంత్రి నారా లోకేష్‌కి అందజేశారు సాయి దుర్గతేజ్. అలాగే విజయవాడలోని అమ్మ అనాథాశ్రమాన్ని స్వయంగా సందర్శించి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయల విరాళం అందించి, తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు.