పిడుగు పాటుకు మూడు తాటిచెట్లు దగ్ధం

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో ఆదివారం సాయంత్రం ఉరుములు,మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టిoచింది.ఈ నేపథ్యంలో అడ్వాలపల్లి గ్రామంలోని రెడ్డి నాయక్ ఇంటి సమీపంలోని మూడు తాటిచెట్లపై పిడుగుపాటుకు మంటలు చెలరేగి తాటిచెట్లు దగ్దమైయ్యాయి.దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.