ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టాలి

Parents along with teachers should pay attention to childrenనవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం రోజు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమల అధ్యక్షత వహిస్తూ సమావేశం ఏర్పాటు చేశారు.పాఠశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయ రాలు కమల మాట్లాడుతు పాఠశాల నిర్వహణ విషయంలో ఉపాధ్యాయుల పాత్రతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఉండాలని సూచించారు. ఉపాధ్యాయులు పాఠశాలలో బోధించిన పాఠాలను ఇంటి వద్ద విద్యార్థులు చదివేలా విద్యార్థులను తల్లిదండ్రులు పోత్సహించాని సూచించారు. దీంతో పాటుగానే విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారనే పరిశీలించాలని సూచించారు. పోషకులు ఇంటింట చదువుల పంట యాప్ను వాడాలని సూచించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతు పాఠశాల నిర్వహణలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రాజమణి, ఉపాధ్యాయబృందంకిషోర్,ఉమాదేవి,సుదర్శన్ రెడ్డి, నాగనాథ్,రాజు,రవికుమార్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.