ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు కథానాయిక రష్మిక మందన్నా తనవంతు సాయం చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. తాజాగా ఆమె మరోమారు తన మంచి మనసుని చాటుకున్నారు. కేరళ వయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడి సృష్టించిన విషాదం పట్ల ఆమె దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది.