నవతెలంగాణ – కామారెడ్డి : సరస్వతి మాత మాత జన్మదినం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని అక్షం పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం వేద పండితులొచే సరస్వతి పుంజా, హోమం జరిపినా అనంతరం చిన్నారులకు అక్షరభ్యాసం జరిపించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లోకేష్ రెడ్డి మాట్లాడుతూ సరస్వతి దేవి జన్మించిన రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే సరస్వతి దేవి ఆశీస్సులు చిన్నురులకు పరిపుర్ణంగా లభిస్తాయన్నరు. తద్వారా పిల్లలు ఉన్నత విధ్యావంతులు అవుతారని నమ్మకంతో వసంత పంచమి రోజు చిన్నారులకు సరస్వతి దేవి దేవి సమక్షంలో ప్రతి ఏటు తమ పాఠశాల లో అక్షరభ్యాసం కార్యక్రమాలు నిర్వహుస్తారానీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆయతి సంగీత రెడ్డి పాఠశాల చైర్మన్ అశోక్ రెడ్డి, ఆధ్యపక బృందం, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గోన్నారు.