ప్రోటోకాల్ పాటించకపోవడంతో మార్చిన శిలాఫలకం

నవతెలంగాణ – రామారెడ్డి
ప్రోటోకాల్ పాటించకుండా, పదవి పూర్తయినా, అన్ని తానై, శిలాఫలకంపై ప్రజా ప్రతినిధుల పేర్లు లేకుండానే ప్రారంభోత్సవం నిర్వహించడంతో, ప్రోటోకాల్ రగడ, అధికారులకు తలనొప్పిగా మారి, ఆవిష్కరించిన శిలాఫలకాన్ని మార్చి, ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకాన్ని రెడ్డి పేటలో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈనెల 12న గ్రామీణ అంగడి రూ.16.95 లక్షల అంచనాతో నిర్మాణం చేపట్టగా, నాబార్డ్ నుండి రూ.15 లక్షలు, జీపీ కాంట్రిబ్యూషన్ రూ.1.95 లక్షలతో నిర్మించి, 12వ తేదీ నాబార్డ్ మేనేజర్ తో పాటు మాజీ సర్పంచ్ పేరుపై శిలాఫలకం ఉండడంతో, మండల స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులపై మండిపడటంతో, అధికారులు నూతనంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు.