– పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ సభ్యులు గాదరి కిషోర్ కుమార్
నవతెలంగాణ – నూతనకల్
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో ప్రభుత్వం మారాలని మార్పుతోనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కరెంటు పోతుండే అని రైతులు ప్రజలు బాధపడుతున్నారని తుంగతుర్తి మాజీ శాసనసభ సభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని చిల్పకుంట్ల లో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పులుసు లింగమల్లయ్య కి ఇటీవల విద్యుత్ షాక్ ఇవ్వడంతో అనారోగ్యానికి గురి అయిన అతని పరామర్శించారు అదే సమయానికి కరెంటు పోవడంతో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు, రైతులకు కరెంటుతో కష్టాలు ఇలా ఉంటున్నాయని అన్నారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక్క సెకండ్ కూడా కరెంటు పోవడం లేదని అసెంబ్లీలో, బహిరంగ సభలో చెబుతుంటే గ్రామాలకు వచ్చేసరికి రోజుకు ఐదుసార్లు కరెంటు పోవడం బాధాకరమని అన్నారు. ప్రజలు కోరుకున్నది ఇలాంటి మార్పున అని ప్రశ్నించారు.సమగ్ర అభివృద్ధి చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదనుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోవడం పట్ల వారికి వారే క్షమాపణ చెప్పుకుంటున్నారని వారు. 1952 విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసిన సంబంధిత అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. అనంతరం బిఆర్ఎస్ నాయకులు బత్తుల రామచంద్ర సతీమణి కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే వారిని పరామర్శించారు అంతకుముందు మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి రేసు వెంకటేశ్వర్లుకు కేక్ కట్ చేసి మిఠాయి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్, సర్పంచుల పూర్వం మండల మాజీ అధ్యక్షుడు సూడి లింగారెడ్డి ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిల్ గౌడ్ మాజీ సర్పంచ్ లు కొంపల్లి రాంరెడ్డి, కొచ్చర్ల బాబు యువజన ప్రధాన కార్యదర్శి కనకటి మహేష్ గౌడ్, నాయకులు రేస్ వెంకటేశ్వర్లు రామసాని వెంకట్ రెడ్డి మాజీ జెడ్పిటిసి గుగులోతు నర్సింగ్ నాయక్ బత్తుల విద్యాసాగర్, విజయ్ పంతం యాకయ్య తదితరులు పాల్గొన్నారు,,,,,,,,,,