హైదరాబాద్ : టీ-హబ్‌తో తమ భాగస్వామ్యాన్ని విస్తరించినట్టు ఆల్టోరాండ్ ఫౌండేషన్ తెలిపింది. ఇందులో భాగంగా తమ అల్గోభారత్ కార్యక్రమంలో స్టార్టప్ ల్యాబ్ ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రారంభించినట్టు పేర్కొంది. ఇది ఇరవై ఎంపిక చేసిన వెబ్3 స్టార్టప్‌ల ఉత్పత్తి, మార్కెట్, నిధుల సంసిద్ధత దిశలో ఉన్నప్పుడు ఇంటెన్సివ్ టెక్నికల్ మరియు బిజినెస్ మెంటార్‌షిప్, ప్రీ-సీడ్ ఫండింగ్‌ను అందజేయనున్నట్టు పేర్కొంది. స్టార్టప్ టీమ్‌ల కోసం 2024 మార్చి 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. కీలకమైన మైలురాళ్లను సాధించిన స్టార్టప్‌లు ఇండియా ఫండ్‌లో భాగంగా అల్గోరాండ్ ఫౌండేషన్ నుండి ప్రీ-సీడ్ ఫండింగ్‌కు అర్హులని తెలిపింది.