టాటా మోటార్స్‌ నుంచి అల్ట్రోజ్‌ ఐసిఎన్‌జి

– ధర రూ.7.55 లక్షలు
హైదరాబాద్‌ : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ కొత్తగా అల్ట్రోజ్‌ ఐసిఎన్‌జి ని విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో ఎపి, టిఎస్‌ టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ రీజినల్‌ మేనేజర్‌ గోపిక్రిష్ణ గోపు, బ్రాండ్‌ మార్కెటింగ్‌ హెడ్‌ రవీంద్రా జైన్‌ లాంచనంగా ఆవిష్కరించారు. ఎక్స్‌షోరూం వద్ద దీని ధరను రూ.7.55 లక్షలుగా నిర్ణయించింది. ట్విన్‌ సిలిండర్‌ సిఎన్‌జి టెక్నలాజీతో ఈ కారును అభివృద్థి చేశామని గోపిక్రిష్ణ తెలిపారు. ఇందులో 1.2 లీటర్‌ రెవొట్రోన్‌ ఇంజిన్‌ను ఉపయోగిం చినట్లు పేర్కొన్నారు.