పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Alumni Associationనవతెలంగాణ – మాక్లూర్ 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ 2001-2002 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం వైభవంగా ఎస్ అర్ గార్డెన్ పంక్షన్ హల్ లో ఆదివారం నిర్వహించారు. విద్యార్థుల కలయిక ఆహ్లాదకర వాతావరణం లో కొనసాగింది. సరిగ్గా 23 సంవత్సరాలు క్రితం మాక్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నత చదువుల కోసం విడి పోయిన వారంతా ఒక చోటికి చేరారు. నాడు విద్యార్థి దశలో చోటుచేసుకున్న ఘటనలను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులంతా కలిసి సంతోషంగా కాలక్షేపం చేశారు. పలువురు పూర్వ విద్యార్థుల ఉన్నతిని తెలుసుకొని ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. రెండున్నర దశాబ్దాల క్రితం విద్యావ్యవస్థలో ఉన్న పరిస్థితులు నేటి పరిస్థితులు పోల్చుతూ ఉపాధ్యాయులు సందేశం అందించారు. మాక్లూర్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించేందుకు మాదాపూర్, కృష్ణానగర్, దుర్గా నగర్, శాంతినగర్, ముల్లంగి గ్రామాల నుంచి కాలినడకన విద్యార్థులు వచ్చిన పరిస్థితులను ఉపాధ్యాయులు గుర్తు చేశారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఉపాధ్యాయుల సేవలను గుర్తు చేసుకుంటూ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రిటైర్డు ఉపాధ్యాయులు అప్పల కిష్టయ్య, బాగేందర్, భూపతిరెడ్డి, మల్కయ్య, రవీందర్ గుప్తా, వేణుగోపాల్, గంగారెడ్డి, వెంకట రాజయ్య, దామోదర్, పురుషోత్తం దాస్, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.