పూర్వ విద్యార్థుల సమ్మేళనం..

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని ఎస్ అర్ కార్డాన్ పంక్షన్ హల్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1997-98 సంవత్సరం చదివిన పూర్వ విద్యార్థులు అతియ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒక్కరిని ఒక్కరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. అధ్యాపకులకు సన్మానం చేశారు. పాఠశాలలోని తీపి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా కలుసుకున్నారు. యదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో, ఆనాటి మధురానుభూతులను పొందుతూ ఉల్లాసంగా గడిపారు.