తిరుమలగిరిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నవతెలంగాణ-తిరుమలగిరి : తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో సోమవారం 2006 -07 సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2006 ఏడు సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు అందరూ ఏకమై తమ చిన్ననాటి ఆత్మీయ అనుబంధాలను నెమరు వేసుకోవడానికి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడో ఉండి ఎక్కడో జీవనం సాగిస్తున్న అలనాటి విద్యార్థుల జ్ఞాపకాలను ఒకరినొకరు నెమరు వేసుకొని వారి యొక్క జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దామెర శ్రీనివాస్, సత్యనారాయణ ,రఘుపతి, షరీఫ్, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం పదివేల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.