పాఠశాలకు పూర్వ విద్యార్థుల సహకారం..

Alumni contribution to the school..నవతెలంగాణ- దుబ్బాక
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట వార్డులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న (2009-2010 బ్యాచ్) పూర్వ విద్యార్థులు కనికి రవి,రాజశేఖర్,ప్రసాద్,కార్తీక్ లు కలిసి రూ.5 వేల విలువైన వాలీబాల్ క్రీడా సామాగ్రిని పాఠశాల హెచ్ఎం ఎండీ.సాదత్ అలీకి శుక్రవారం అందించారు. పాఠశాల విద్యార్థులు మండల,జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నందునా వారిని ప్రోత్సహించేందుకు తమవంతుగా ఈ సహకారం అందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను హెచ్ఎం సాధత్ అలీ ,ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఉపాధ్యాయులు వెంకట కృష్ణమాచారి,శ్రీనివాస్ రెడ్డి,కృష్ణమూర్తి,నరేష్,పద్మావతి,శైలజ,అశోక్,దినేష్,చంద్రశేఖర్ ఉన్నారు.