తోటి స్నేహితురాలుకు పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం

నవతెలంగాణ- తొగుట: పూర్వ విద్యార్థులందరు తమ తోటి స్నేహితురా లుకు ఆర్థిక సహాయం అందించారు.శనివారం ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ గ్రామానికి చెందిన
2006-07 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన కీసరి వేంకటేష్ కుటుం బాన్ని పరామర్శించి, ఆర్థిక సహా యం అందించారు. అనంతరం వారు మాట్లాడు తూ ఒక వ్యక్తికి, కుటుంబానికి కష్టం వచ్చిందంటే ఓదార్పు ఎంతో అవసరం అన్నారు. ఓదార్పు తల్లి దండ్రులు, సోదరులు, బంధువులు, స్నేహితులు ఇలా పలువురు నుండి లభిస్తుందన్నారు. కానీ ఓ మిత్రురాలి కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసు కొని పూర్వ విద్యార్థులందరూ కలిసి వారికి ఓదా ర్పు అందించామన్నారు.అదేవిధంగా కుటుంబానికి అండగా నిలవాలనే దృఢ సంకల్పంతో రూ.26,500 ఆర్థిక సహాయం అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసం శివకుమార్,సిరిమిల్ల రాజు, కీసరి మహేష్, కీసరి హరి, కీసిరి రమేష్, కీసరి నరేశ్, రేణుక, శ్యామలా, అరుణా, పూది రాజు, కనక య్య తదితరులు పాల్గొన్నారు.