త్రాగునీటికి పూర్వ విద్యార్థుల చేయూత

– రూ.10 వేల నగదు అందజేత..
నవతెలంగాణ – బెజ్జంకి 
ఎందరో విద్యార్థులకు చదువును అందించింది మండల పరిధిలోని బేగంపేట ప్రభుత్వోన్నత పాఠశాల నేడు పాఠశాలలో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పాఠశాలలో నెలకొన్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి 2006-07 విద్యా సంవత్సరంలోని పదవ తరగతి విద్యార్థులు త్రాగునీటి సమస్య పరిష్కారానికి రూ.10 వేల నగదును ఇంచార్జీ ప్రధానోపాధ్యాయుడు భరత్ రెడ్డికి శనివారం ఆర్థిక సహయంగా అందజేసి చేయూతనందించారు. బేగంపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తోచిన సహయమందజేయాలని పూర్వ విద్యార్థులు కోరారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఆర్థిక సహయమందజేసిన తోటి మిత్రులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు పూల్లూరీ ప్రభాకర్, మనోహర్ రెడ్డి, రామచంద్రం, శ్రీనివాస్, ఖలీమొద్దిన్, పూర్వ విద్యార్థులు ఉప్పులేటి శ్రీనివాస్, సంతోష్, సురేష్, శేఖర్, మధు పాల్గొన్నారు.