
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సిద్ధార్ధ విద్యానికేతన్ ఉన్నత పాఠశాల లో తమకు చదువు చెప్పిన వెంకటయ్య ఉపాధ్యాయునికి వారి పిల్లలు చదువు కోసం పూర్వపు విద్యార్థులు తమవంతు గురువారం 30,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.పేద దకుటుంబం కావడం తో తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు వేంకటయ్య ఉపాధ్యాయుని సమిష్టి గా నిధులు సేకరించి వారి పిల్లల చదువు కోసం మండలకేంద్రం లోని శాంతి నీకేతన్ ఉన్నత పాఠశాలలోపదవ తరగతి చదువు ఇద్దరి పిల్లలకు పూర్వవు విద్యార్థులు ప్రిన్సిపాల్ నడ్డి ఆంజనేయులు కు అందజేశారు.ఈసందర్బంగా పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ చిన్నతనంలో పాఠాలు బోధించిన మండ లంలోని ఏనేమీదిగూడెం గ్రామానికి చెందిన వెంక టయ్య ఆర్థిక ఇబ్బందులు తెలుసుకున్నామని, వారిపిల్లలకు ఫీజులు కట్టే స్థోమత లేని పరిస్థితిని తెలుసుకుని గత విద్యా సం వత్సరంలో రూ.30వేలు, ఈ యేడాది సైతం ఇద్దరి పిల్లలకు రూ.30వేలను అందించామని తెలిపారు. కార్యక్రమంలో నాటి గురువు వెంకటయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, పూర్వ విద్యార్థులు శ్రీరమణ, వెంకట్రెడ్డి, ఏడుకొం డలు, యాదగిరిరావు, నాగరాజు, కృష్ణారెడ్డి, మాధ వరెడ్డి, సీతారాం, సుధాకర్రావు పాల్గొన్నారు.